సిద్ధార్థ్ రాయ్ మూవీ థర్డ్ సింగిల్ నువ్వెవరో విడుదల

Published On: December 19, 2023   |   Posted By:

సిద్ధార్థ్ రాయ్ మూవీ థర్డ్ సింగిల్ నువ్వెవరో విడుదల

దీపక్ సరోజ్, వి యశస్వీ సిద్ధార్థ్ రాయ్ నుంచి సోల్ ఫుల్ థర్డ్ సింగిల్ నువ్వెవరో మరి పాట విడుదల

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో వైరల్ అయ్యింది. అలాగే స్టార్ కంపోజర్ రధన్ స్వరపరిచిన చెలియాచాలు, లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.

ఇప్పుడు థర్డ్ సింగిల్ నువ్వెవరో మరి పాటని విడుదల చేశారు మేకర్స్. రధన్ ఈ పాట కోసం సోల్ ఫుల్ నెంబర్ ని కంపోజ్ చేశారు. బెన్నీ దయాల్ ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకున్న ఈ పాటకు పూర్ణాచారి అందించిన లిరిక్స్ మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. ఈ పాటలో హీరో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసిన విధానం చాలా యూనిక్ ఉంటూ క్యురియాసిటీని పెంచింది.

శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు కెమరా మెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం :

దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్

సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి యశస్వీ
నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన
బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్, విహిన్ క్రియేషన్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
సంగీతం: రధన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి