పారిజాత పర్వం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: November 21, 2023   |   Posted By:

పారిజాత పర్వం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, సంతోష్ కంభంపాటి, వనమాలి క్రియేషన్స్ ‘పారిజాత పర్వం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ‘పారిజాత పర్వం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రస్టింగా వుంది. పోస్టర్ లో చైతన్యరావు చేతిలో గన్ తో షాకింగ్ గా చూస్తూ కనిపించారు. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనే ట్యాగ్ లైన్ వున్న పోస్టర్ లో చైతన్యతో పాటు సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం చాలా క్యురియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ కాన్సెప్ట్ టీజర్ ని విడుదల చేయనున్నారు.

బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ‘రీ’ సంగీతం అందిస్తున్నారు. సశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహ నిర్మాత.

తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం – సంతోష్ కంభంపాటి
ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్
సహ నిర్మాత -అనంత సాయి
డీవోపి-బాల సరస్వతి
సంగీతం-రీ
ఎడిటర్- సశాంక్ వుప్పుటూరి
ఆర్ట్ డైరెక్టర్ – ఉపేందర్ రెడ్డి
డిజైనర్ – చిన్మయి కాకిలేటి
పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచెర్ల
సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు
సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల
పీఆర్వో -వంశీ శేఖర్