69 వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన ఛీర్స్ టు త్రీ ఆఫ్ అస్ చిత్రం

Published On: February 2, 2024   |   Posted By:

69 వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన ఛీర్స్ టు త్రీ ఆఫ్ అస్ చిత్రం

ఉత్త‌మ న‌టిగా (క్రిటిక్స్‌) షెఫాలీ షా మరియు ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్‌గా అవినాఫ్ అరుణ్ ధావేర్‌ల‌కు ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాలు.

జైదీప్ అహ్లావత్, స్వానంద్ కిర్కిరే, కాదంబరి కదమ్ మరియు పాయల్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఛీర్స్ టు త్రీ ఆఫ్ అస్ అవినాష్ అరుణ్హెల్మ్డ్ డ్రామా ఫిల్మ్ మొదటిసారిగా నవంబర్ 24, 2022న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది, దాదాపు ఒక సంవత్సరం తర్వాత నవంబర్ 3, 2023న భారతీయ థియేటర్లలో విడుదలైంది.ఈ చిత్రం థియేటర్లలో ఆకట్టుకుంది మరియు పండుగ సర్క్యూట్‌లో మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇటీవలే OTTలో విడుదలై ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా జరిగిన 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో, త్రీ ఆఫ్ అస్‌లో తన అద్భుత నటనకు షెఫాలీ షా ఉత్తమ నటి (క్రిటిక్స్) ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు పలు విభాగాల్లో అనేక అవార్డులకు ఎంపికైంది. అలాగే అమేజింగ్ లెన్స్ మ్యాన్ అవినాష్ అరుణ్ ధావారే త్రీ ఆఫ్ అస్‌లో అద్భుతంగా పనిచేసినందుకు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రం అల్లు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ్యాచ్‌బాక్స్ షాట్స్ అండ్ అల్లు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాపంపై నిర్మాణం జ‌రుపుకుంది. ఈ రోజు ఇంత గొప్ప ఘ‌న‌త సాధించ‌డంలో ఈ నిర్మాణ సంస్థ‌లు త‌మ వంతు కీల‌క పాత్ర‌ను వ‌హించాయి.అవినాష్ అరుణ్, ఓంకార్ అచ్యుత్ బర్వే, అర్పితా ఛటర్జీ కథను అందించారు. వరుణ్ గ్రోవర్, షోయబ్ జుల్ఫీ నజీర్ డైలాగ్స్ రాశారు.నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. డెమెన్షియాతో బాధపడుతున్న శైలజా దేశాయ్ కథ ఇది.

ఈ క్ర‌మంలో త‌న స్వ‌గ్రామానికి వెళ్లిన ఈ ప్రయాణంలోనే ఆమె చిన్ననాటి ప్రేమ కూడా తార‌స‌ప‌డుతుంది. సినిమా అంతా క్షమాపణ, విముక్తి వంటి ప‌లు మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో కొన‌సాగుతుంది.