ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ
aa-ammayi-gurinchi-meeku-cheppali.jpg
సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
?
స‌మ్మోహ‌నం..ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి క్లాస్ లవ్ స్టోరిగా చెప్తూంటారు.  థియేట‌ర్ల‌లో ఓ మాదిరిగా ఆడిన ఆ చిత్రం.. ఆ త‌ర్వాత టీవీలో, ఓటీటీలో క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుని కుమ్మేసింది. మళ్లీ వీళ్లిద్దరి  క‌ల‌యిక‌లో మరో సినిమా అన‌గానే అంద‌రిలోనూ ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. వీరి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన కొత్త చిత్రం.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా అప్పటి మ్యాజిక్ మళ్లీ రీ క్రియేట్ చేసిందా…ఇంతకీ ఏ అమ్మాయి గురించి ఇంద్రగంటి మనకు చెప్పాలనుకున్నారో రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్:

సూపర్ హిట్ చిత్రాలను అందిస్తున్న దర్శకుడుగా నవీన్  (సుధీర్ బాబు) కు పెద్ద పేరుంటుంది.అయితే రొటీన్ సినిమాలు తీస్తున్నాడని విమర్శలు ఉంటాయి. దాంతో ఈ సారి లేడీ ఓరియెంటెండ్ కథ చేయాలనుకుని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో కొత్త హీరోయిన్ ని పరిచయం చేద్దామనుకుంటూంటే… ఓ పాడైన పాట రీల్ దొరుకుతుంది. దాన్ని కడిగించి చూస్తే అందులో ఓ అందమైన అమ్మాయి  (కీర్తి శెట్టి) . ఆ అమ్మాయి ఎడ్రస్ కోసం వెతికి చివరకు పట్టుకుంటే తెలిసే విషయం…ఆమె ఓ డాక్టర్ పేరు అలేఖ్య. ఆమెకు సినిమాలు అంటే అసలు ఇంట్రస్ట్ లేదు. పోనీ ఆమె తల్లి తండ్రుల వైపు నుంచి నరుకుదామని ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్లకీ ఇష్టం లేదు. సినిమా అంటే అసహ్యం అన్నట్లు చెప్తారు. దాంతో వాళ్లను ఒప్పించే ప్రాసెస్ లో అసలు ఎందుకు సినిమాలో నటించటానికి విముఖత చూపుతున్నారని తెలుసుకునే ప్రాసెస్ లో ఓ నిజం తెలుస్తుంది. అదేమిటంటే..అసలు తను వెతుకుతున్న  రీల్ లో కనిపించి ఆమె ..అలేఖ్య వేరు అని. అసలు రీల్ లో కనిపించిన అమ్మాయి ఏమైంది. చివరకు అలేఖ్య ని తన సినిమా కోసం ఒప్పించాడా..వాళ్లు సినిమాపై అసహ్యం పెంచుకోవటానికి గల కారణం ఏమిటి వంటి విషయాలు సినిమాలు చూడవచ్చు.

విశ్లేషణ:

సాధారణంగా ఏ కథకు అయినా హీరోకు ఉండే లక్ష్యాన్ని బట్టే కాంప్లిక్ట్స్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ హీరో లక్ష్యం…తన సినిమాకు హీరోయిన్ కావాలి. అది ఫలానా అమ్మాయే కావాలని. అసలు ఆమె చెయ్యకపోయినా అన్ని సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ కు మరొక హీరోయిన్ దొరుకుతుంది. అలా ఎప్పుడైతే అనిపిస్తుందో మనకు అక్కడే  సినిమా పై ఆసక్తి పోతుంది. అంటే ఈ కథ కాంప్లిక్ట్స్ బలంగా లేకపోవటమే దెబ్బ కొట్టిందని అర్దమవుతుంది. పోనీ ఇదేమన్నా రొమాంటిక్ కామెడీనా సమ్మోహనం సినిమాలాగ అంటే..అదీ కాదు.

సినిమా ప్రారంభమై ఇంటర్వెల్ వచ్చేదాకా కథలోకి రాకపోవటంతో కంటెంట్ తక్కువ ఉందనే సిగ్నల్స్ అక్కడే అందుతుంది. ఇంటర్వెల్ లో కాస్తంత కథ మొదటి మలుపు తీసుకున్నాక సెకండాఫ్ లో ఏదో చెప్పబోతున్నాడనే ఆసక్తి ఏర్పడుతుంది. అయితే అక్కడా రొటీన్ గానే జరిగిపోతుంది. దాంతో  ఇక ఈ సినిమాలో చెప్పడానికి విషయం ఏమీ లేదనే సంగతి అర్ధమైపొతుంది నిజానికి ఇంటర్వెల్ లోనే  కథలో ఒక కాంప్లిక్ట్స్ వస్తుంది. విచిత్రం ఏమిటంటే.. ఈ సంఘర్షణని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు కనపడరు. ఆ  పాత్రధారులే లైట్ తీసుకుంటారు. దాంతో  సన్నివేశాలన్నీ తేలిపోతుంటాయి. ఇక కథని ముగించాలి కాబట్టి.. ముగింపు వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ కి జస్టిఫీకేషన్ ఏమిటంటే….హీరోకేమీ ఉండకపోవటం..మొత్తం హీరోయిన్ కథే చెప్పటం. ఏదైమైనా డైరక్టర్   ఒక ఫీల్ గుడ్ సెంటిమెంట్ మూవీ ని తీయాలనుకున్నాడు.   సెటప్ అంతా ఓకే. కాకపొతే తీసిన విధానమే పాతది. స్క్రీన్ ప్లే,స్లో నేరేషన్ సినిమాని మరీ నీరసపరిచేసాయి.

టెక్నికల్ గా …

అష్టా చెమ్మా నుంచి మొన్నటి సమ్మోహనం దాకా మంచి అభిరుచిగల దర్శకుడనిపించుకున్నాడు ఇంద్రగంటి. ‘సమ్మోహనం’ సరిగ్గా ఆడకపోయిన తన ఒరిజినాలిటీని చూపించగలిగాడు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి  ఆయనలోని  ఒరిజినాలిటీ తప్పింది. ఈ సినిమా కలర్ ఫుల్ గా చూడగలిగాము అంటే అది కెమెరా ప్రతిభే. అయితే ఇలాంటి సినిమాలకు కావాల్సిన మ్యూజిక్ ఈ సినిమాని కలిసి రాలేదు. రెండు పాటలు వినడానికి, చూడటానికి బావున్నాయి. అద్బుతమైతే కాదు.  నేపధ్య సంగీతం బాగుంది.  పాటల్లో కెమెరాపనితనం డీసెంట్ గా వుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. కథ కావాల్సింది సమకూర్చారు.

ఈ సినిమా స్టోరీ లైన్ గా నావెల్టీ ఉన్నా దాన్ని స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించే విషయంలో ఇంద్రగంటి తడబడ్డాడు. అయితే సినిమా కలర్ ఫుల్ గా ఉంది. అందుకు సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇలాంటి సినిమాలకు అవసరమైన సాంగ్స్ మాత్రం లేవు. ‘మీరే హీరో లాగ’జస్ట్ ఓకే, ‘మీరే హీరో లాగ’పాట మెలోడి. విజువల్స్ బాగున్నాయి. ఐటం సాంగ్ బాగోలేదు. డైలాగ్స్  అక్కడక్కడా కొన్ని  బాగున్నాయి. ఇంద్రగంటి స్పెషలైజ్ అయిన సెటిల్డ్ హ్యూమర్ పండించే ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ..సెకండాఫ్ లో ల్యాగ్ లను వదిలేసింది. ఇంకాస్త ట్రిమ్ చెయ్యిచ్చేమో అని ఫీల్ కలిగించింది. సినిమాలో ఫ్రేమ్స్ రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో ..

సుధీర్ బాబు మంచి టైమింగ్ వున్న నటుడు. తనపాత్రని చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే  ఈ పాత్రకి తగినట్లుగా  అతని బాడీ లాంజ్వేజ్ కి మార్చుకున్నాడు. కృతిశెట్టి  పాత్ర బావుంది. ఆమె  స్క్రీన్ ప్రజన్స్ కూడా బావుంది. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ పాత్రలని దర్శకుడు చక్కగా డిజైన్ చేశాడు.  అవసరాల శ్రీనివాస్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

ప్లస్ లు :
లీడ్ పెయిర్
ప్లాష్ బ్యాక్
ఇంట్రవెల్, క్లైమాక్స్

మైనస్ లు :
రిలీఫ్ ఇచ్చే ఫన్  లేకపోవటం పెద్ద మైనస్
వీక్ ప్లాట్

చూడచ్చా :
క్లాస్ గా  అనిపిస్తూ..స్లోగా నడిచే  ఈ సినిమా…కునుకు పాట్లు పడుతూ ఓ సారి చూడచ్చు.

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్
నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ,   శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్  తదితరులు.
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
సమర్పణ:  గాజులపల్లె సుధీర్ బాబు
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
Run Time: 2 Hrs 25 Mins
విడుదల తేదీ :16-09-2022