గాలోడు మూవీ 17 ఫిబ్రవరి 2023 న అమేజాన్ ప్రైమ్ మరియు ఆహాలో స్ట్రీమింగ్

మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న అమేజాన్ ప్రైమ్ మరియు ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సుడిగాలి సుధీర్ మ్యాసీవ్ బ్లాక్బస్టర్ గాలోడు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా భారీ అంచనాలతో థియేటర్స్లో రిలీజై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. సుధీర్ కెరీర్లోనే మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు అయిన అమేజాన్ ప్రైమ్ మరియు ఆహాలో ప్రసారం కానుంది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు రాజశేఖర్రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

గాలోడు కథేమిటంటే

రజనీకాంత్ అనే యువకుడు ఏ పని పాట లేకుండా ఊరిలో జులాయిగా తిరుతుంటాడు. దాంతో అందరూ అతన్ని గాలోడు అంటుంటారు. అనుకోకుండా ఓ మర్డర్ కేసులో చిక్కుకున్న అతడు ఆ నేరం నుంచి ఎలా బయటపడ్డాడు? శుక్ల (గెహానా సిప్పీ) అనే అమ్మాయి ప్రేమను ఎలా సొంతం చేసుకున్నాడన్నదే ఈ సినిమా కథ.

నటీనటులు  :

సప్తగిరి, పృథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు.

సాంకేతికవర్గం :

సినిమాటోగ్రఫి: సి రాం ప్రసాద్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సమర్పణ: ప్రకృతి
బేనర్: సంస్కృతి ఫిలింస్,
రచన – దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.