సి 202 (C 202)  చిత్రం ఫస్ట్ లుక్ విడుదల 

Published On: January 29, 2024   |   Posted By:

సి 202 (C 202)  చిత్రం ఫస్ట్ లుక్ విడుదల 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సి 202 (C 202) ఫస్ట్ లుక్ విడుదల

మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం సి 202 (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.

అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా

దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ మా సి 202 (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాము. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హైఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించాము. మా చిత్రం లో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తారు. ఈ చిత్రంలో 21 నిమిషాల గ్రాఫిక్ ఉంటాయి.

ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సి 202 (C 202) ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నాము.

నా గత చిత్రం హేజా(Heza) నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అమెజాన్ ప్రైమ్ లో హేజా(Heza) చిత్రాన్ని చూసి నన్ను చాలా మంది హేజా(Heza) 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. హేజా(Heza) 2 త్వరలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మంచి హారర్ థ్రిల్లర్ చిత్రం సి 202 (C 202) తో త్వరలో మీ ముందుకు వస్తాను. త్వరలో ట్రైలర్ ను విడుదల చేస్తాం అని తెలిపారు.

నటి నటులు :

మున్నా కాశి, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్ : మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures)
కెమెరా మాన్ : సీతారామరాజు ఉప్పుతాల్లా
నిర్మాత : మనోహరి కె ఎ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం : మున్నా కాశి