BSS10 మూవీ టైటిల్ – ఫస్ట్ లుక్ జనవరి 3 విడుదల

Published On: January 1, 2024   |   Posted By:

BSS10 మూవీ టైటిల్ – ఫస్ట్ లుక్ జనవరి 3 విడుదల

శ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్ కె చంద్ర, 14 రీల్స్ ప్లస్ BSS10 కీలక షెడ్యూల్‌లు పూర్తి జనవరి 3న టైటిల్ & ఫస్ట్ లుక్

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర, ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ BSS10 కోసం కలిసి పని చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈహై బడ్జెట్ చిత్రం, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు.

మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. BSS10 టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

బెల్లంకొండను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి సాగర్ కె చంద్ర పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు

సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ముఖేష్ జ్ఞానేష్ డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్ , రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం :

శ్రీనివాస్ బెల్లంకొండ

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం : సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ముఖేష్ జ్ఞానేష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు